విశ్వంభర గ్లింప్స్ గూస్‌బంప్స్ అంతే

మెగా సూపర్ స్పెషల్.. మెగాస్టార్ చిరంజీవి జన్మదిన పండుగ సందర్భంగా విడుదలైన విశ్వంభర గ్లింప్స్ ఫ్యాన్స్ మనసులను అలా అలా గాల్లోకి ఎగిరేలా అద్భుతంగా చేశారు. దర్శకుడు వశిష్ట క్రియేట్ చేసిన ఈ సొషియో ఫాంటసీ సినిమాలో, ఒక చిన్న పిల్లవాడికి, ముసలివాడికి మధ్య జరిగిన మాటల్లో ప్రపంచంలోని స్వార్థం, వినాశనం, అసహనం చూపిస్తూ, కష్ట సమయాల్లో రక్షకుడిగా చిరంజీవి ఎంట్రీ చూపించారు. ఒక్కసారే గూస్‌బంప్స్ బాబోయ్.. అదిరిపోయింది‌. ప్రొడక్షన్ డిజైనర్ ఏఎస్ ప్రకాష్ రూపొందించిన విశ్వంభర ప్రపంచం, సినిమాటోగ్రాఫర్ చోటా కె. నాయుడు అందించిన మైండ్-బ్లోయింగ్ విజువల్స్, ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి మ్యూజిక్ కలసి అద్భుతమైన ఎమోషనల్ ఎక్స్‌పీరియెన్స్ ని ఇస్తున్నాయి. త్రిష కృష్ణన్ కథానాయికగా, అశిక్ రంగనాథ్, కునాల్ కపూర్ కీలక పాత్రల్లో నటించిన విశ్వంభర మూవీ 2026 సమ్మర్ స్పెషల్‌గా తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ భాషల్లో రాబోతుంది. ఈ మూవీ చిరంజీవి ఫ్యాన్స్ కి పుట్టినరోజు స్పెషల్ గిఫ్ట్ లా excitement ని ఇచ్చింది. ఇది కదా మెగాస్టార్ రేంజ్ అంటే.. అంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *