అమరావతి వరదలపై రాజకీయ చర్చలు మళ్లీ వేడెక్కాయి. ఇటీవల వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి అమరావతిలో పులస చేపలు దొరికే పరిస్థితి వస్తుందని కాంట్రవర్సీ కామెంట్స్ చేయగా, దీనిపై టీడీపీ నేతలు ఘాటుగా స్పందించారు. మున్సిపల్ మంత్రి నారాయణ స్పందిస్తూ.. నీరుకొండ, కొండవీటి వాగు ప్రాంతాలను పరిశీలించి, వెస్ట్ బైపాస్ రోడ్డుపై బ్రిడ్జి నిర్మాణ సమయంలో మట్టి అడ్డుగా వదిలేయడంతో నీరు నిలిచిపోయిందని తెలిపారు. మట్టిని తొలగించి, రెండు చోట్ల గండ్లు కొట్టి నీరు సాఫీగా వెళ్లేలా చూడాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఇది కేవలం రెండు గ్రామాల పరిధిలోనే సమస్యగా ఉందని, రాజధాని మునిగిపోతుందనడం అర్థరహితమని అన్నారు. ఇదే సమయంలో హోంమంత్రి అనిత, అమరావతి అభివృద్ధిని ఓర్చుకోలేక వైసీపీ నేతలు, సోషల్ మీడియా వేదికలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. అబద్ధాలు పుట్టించే పోస్టులపై లీగల్ చర్యలు తీసుకుంటామని, packed finding కమిటీ ద్వారా నిజాలను బయటపెట్టి బాధ్యులపై కేసులు పెడతామని హెచ్చరించారు

