[9:36 AM, 8/19/2025] srinivas Writings: ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత పథకాలపై బీజేపీ నేతల వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి. టీడీపీ మద్దతుతో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం నడుస్తున్నప్పటికీ, కూటమి భాగస్వాముల మధ్య విభేదాలు బయటపడుతున్నాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏపీలో 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్‌గా ఉన్న లంకా దినకర్, ఉచిత పథకాలపై జాతీయస్థాయి చర్చ అవసరమని సూచించగా, ఆచరణీయమైన పథకాలే అమలు చేయాలని చంద్రబాబుకు నివేదిక ఇస్తానని అన్నారు. ఇదే సమయంలో తెలంగాణ బీజేపీ నేత మాధవీలత, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం వల్ల ప్రయోజనం ఏమిటని ప్రశ్నించారు. తాజాగా ప్రారంభమైన ‘స్త్రీశక్తి’ పథకంపై ఇలా విమర్శలు రావడం టీడీపీకి ఇబ్బందికరంగా మారింది. గతంలోనూ బీజేపీ-టీడీపీ పొత్తు మధ్య విభేదాలు ఏర్పడి విడిపోయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మిత్రపక్షం నుంచే ఇలాంటి మాటలు రావడంతో, బీజేపీ ఏదైనా రహస్య అజెండాతో ముందుకు వెళ్తుందా అనే అనుమానాలు చెలరేగుతున్నాయి. మొత్తానికి మాధవీలత, లంకా దినకర్ వ్యాఖ్యలు ఆంధ్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
[9:36 AM, 8/19/2025] srinivas Writings: వాళ్ళు సర్దుకుపోరు, వీళ్ళు

