వాళ్ళు సర్దుకుపోరు, వీళ్ళు సర్దిచెప్పరు

రాష్ట్ర రాజకీయాల్లో సీనియర్ నేతలు–జూనియర్ నేతల మధ్య విభేదాలు తీవ్రంగా పెరుగుతున్నాయి. ఒకే పార్టీలో ఉన్నా కలిసిపోవడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా టీడీపీ, జనసేనలో కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేలు సీనియర్ల సలహాలను పట్టించుకోవడంలేదు. తాము టికెట్లు త్యాగం చేశామని చెప్పుకునే సీనియర్లను పక్కన పెట్టేస్తున్నారు. పైగా కొందరు పొరుగు పార్టీల నుంచి వచ్చి గెలవడంతో విభేదాలు మరింతగా ముదురుతున్నాయి. మైలవరం, నూజివీడు, కోవూరు, తిరువూరు, కొవ్వూరు, అనంతపురం అర్బన్ వంటి నియోజకవర్గాల్లో ఈ తగాదాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దాంతో సుమారు 40 నియోజకవర్గాల్లో అంతర్గత రచ్చ జరుగుతోంది. అధిష్టానం మాత్రం అందరినీ కలుపుకొని పోవాలని, సీనియర్ల నుంచి అవసరమైతే సలహాలు తీసుకోవాలని చెబుతున్నా… గెలిచిన కొత్త నేతలు పట్టించుకోవడం లేదు. ఈ పరిస్థితి పెద్ద సమస్యగా మారిందని విశ్లేషకులు అంటున్నారు. సమస్య పరిష్కారానికి ఉమ్మడి సమావేశాలు అవసరమన్న సూచనలు వస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *