ఏపీలో రాజకీయాలు కొత్త మలుపులు తీసుకుంటున్నాయి. కూటమి ప్రభుత్వం ప్రజల మధ్య యాక్టివిటీని పెంచుతూ ప్రతి రెండు రోజులకోసారి సీఎం చంద్రబాబు ప్రత్యక్షమవుతున్నారు. వారంలో మూడు సార్లు ఏదో ఒక కార్యక్రమం ద్వారా ప్రజలకు చేరువై, అందుబాటులో ఉన్న ముఖ్యమంత్రి అనే ఇమేజ్ తెచ్చుకోవాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. అదే సమయంలో వైసీపీ మాత్రం నిశ్శబ్దంగానే ఉంది. ఎన్నికల ఫలితాలు వచ్చి ఏడాదిన్నర గడిచినా, పార్టీ తరఫున పెద్దగా.. కార్యక్రమాలు జరగకపోవడం, జగన్ తాడేపల్లి లేదా బెంగళూరుకే పరిమితం కావడం విమర్శలకు దారితీస్తోంది. ఈ మధ్య చేసిన పరామర్శల పర్యటనలు కూడా వివాదాల్లోకి చేరడం పార్టీకి మైనస్ అయింది. కూటమి దూకుడుతో ముందుకు వెళ్తుంటే, వైసీపీ ప్రతిస్పందన లేకుండా వెనుకబడుతోందనే టాక్ వినిపిస్తోంది. అందుకే జగన్ కూడా గతంలో చంద్రబాబు చేసినట్టే, నిరంతరం ప్రజల మధ్యకు వచ్చి చురుకుగా ఉండాల్సిన అవసరం ఉందని పార్టీ శ్రేణులు కోరుతున్నాయి. లేదంటే, జగన్ రాజకీయంగా మరుగున పడే ప్రమాదం ఉందన్న చర్చ గట్టిగా వినిపిస్తోంది,

