విశాఖపట్నం దశ తిరిగిందన్న మాట ఇప్పుడు అన్ని వర్గాల్లో వినిపిస్తోంది. ఏ ఎన్నిక వచ్చినా టీడీపీకే అండగా నిలిచిన విశాఖ, ఇప్పుడు ఆ పార్టీ ప్రభుత్వం రావడంతో అభివృద్ధి పథంలో దూసుకెళ్తోంది. సీఎం చంద్రబాబు నాయుడు తన విజన్‌తో విశాఖను విశ్వనగరంగా తీర్చిదిద్దే దిశగా ముందుకెళ్తున్నారు.
ఇటీవల గూగుల్ ఏఐ హబ్ ప్రాజెక్ట్‌ను విశాఖకు తీసుకురావడం రాష్ట్రానికి గర్వకారణమైంది. వైజాగ్‌లో “జీ అంటే గూగుల్” అనే కామెంట్ ఇప్పుడు ప్రతిచోటా వినిపిస్తోంది. విశాఖను ఐటీ హబ్‌గా మార్చే దిశలో చంద్రబాబు కలలు కన్న విధంగా, ఇప్పుడు ఆ కల నిజమవుతోంది.
ఐటీ మంత్రి నారా లోకేష్ కూడా విశాఖ అభివృద్ధిపై పూర్తి దృష్టి పెట్టారు. నవంబర్ 14, 15 తేదీల్లో జరిగే గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్ లో టీసీఎస్, కాగ్నిజెంట్, యాక్సెంచర్ వంటి దిగ్గజ కంపెనీలు పెట్టుబడులు పెట్టనున్నాయని ఆయన వెల్లడించారు. దీని ద్వారా వేలాది ఉద్యోగాలు రానున్నాయి..
లోకేష్ ఆలోచన ప్రకారం, రానున్న ఐటీ ప్రాజెక్టుల ద్వారా విశాఖలోనే ఇరవై లక్షలలో నాలుగవ వంతు ఉద్యోగాలు ఏర్పడతాయి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాదు, ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అన్న స్లోగన్ తో ప్రభుత్వం పెట్టుబడులను వేగంగా ఆకర్షిస్తోంది.

