విశాఖలో రహేజా భారీ పెట్టుబడి

“””””””””””””””””””””””””””
విశాఖలో గూగుల్‌ ఏఐ ఆధారిత డేటా సెంటర్‌ ఏర్పాటుతో పాటు మరో భారీ పెట్టుబడి రాబోతోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ కె. రహేజా కార్పొరేషన్‌ 2,172 కోట్ల పెట్టుబడితో ఐటీ, వాణిజ్య, నివాస భవనాల నిర్మాణానికి సిద్ధమైంది. ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 9,600 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
ప్రభుత్వాన్ని ఆ సంస్థ 27.10 ఎకరాల భూమి కేటాయించమని కోరింది. ప్రాజెక్టు రెండు దశల్లో పూర్తవుతుంది.
మొదటి దశలో 2028 నాటికి 663 కోట్లు పెట్టి 9.59 లక్షల చదరపు అడుగుల వాణిజ్య స్థలం అందుబాటులోకి వస్తుంది. రెండో దశలో 2031–2035 నాఇకి 1,418 కోట్లు ఖర్చుతో 19.06 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం అభివృద్ధి చేయనుంది.
మొత్తం 28.65 లక్షల చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ లభించనుంది. ఇది గూగుల్ డేటా సెంటర్‌తో పాటు విశాఖలో కొత్తగా వచ్చే ఐటీ కంపెనీలకు పెద్ద బూస్ట్‌గా మారనుంది. ప్రస్తుతం మిలీనియం టవర్స్‌లో ఉన్న 6 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని టీసీఎస్, కాగ్నిజెంట్, యాక్సెంచర్ వంటి కంపెనీలు ఇప్పటికే వినియోగిస్తున్నాయి.
విశాఖ ఇప్పుడు దక్షిణ భారత ఐటీ హబ్‌గా ఎదుగుతున్నదని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *