[10:03 AM, 8/12/2025] srinivas Writings: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత కొంతకాలంగా హాట్ టాపిక్‌గా మారిన ‘రెడ్ బుక్’ ఇప్పుడు మౌనంలోకి వెళ్లినట్టుగా కనిపిస్తోంది. విపక్షంలో ఉన్నప్పుడు ‘రెడ్ బుక్’లో వైసీపీ నేతలు, అధికార దుర్వినియోగం చేసిన అధికారులు, పోలీసుల పేర్లు రాసి, అధికారంలోకి వచ్చాక వారికి వడ్డీతో సహా చెల్లిస్తానని హామీ ఇచ్చిన మంత్రి నారా లోకేశ్, గడచిన 14 నెలలుగా ఆ పుస్తకం శక్తిని చూపించారు. పలువురు మాజీ నేతలపై కేసులు నమోదైనా, కొందరు అధికారులు పక్కకు తప్పించబడ్డా, ఇప్పుడు ఆయన ప్రసంగాల్లో ‘రెడ్ బుక్’ ప్రస్తావన కనిపించడం లేదు. ఎన్నికల తరువాత అరెస్టుల వల్ల కక్షసాధింపు ఆరోపణలు పెరుగుతుండటం, విపక్షం చేస్తున్న “రెడ్ బుక్ రాజ్యాంగం” విమర్శలు బలపడటం వల్లే ఈ మార్పు వచ్చిందా అన్నది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఒకప్పుడు కూటమి వేదికలపై తప్పనిసరిగా వినిపించిన ఈ పదం, ఇప్పుడు మళ్లీ బయటకు వస్తుందా లేదా అనేది ఆసక్తిగా మారింది.
రెడ్ బుక్ తో టీడీపీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపిన లోకేశ్, ఇటీవల జిల్లాల పర్యటనల్లో కూడా ఆ పదం మినహాయించడం గమనార్హం.
విపక్షంలో ఎగతాళి చేసిన వైసీపీ నేతలు, ఇప్పుడు అదే పదం వినగానే హడలిపోయే స్థితికి వచ్చిన సంగతి తెలిసిందే.

