ఇప్పుడు హాట్ టాపిక్.. ఒక గుర్తు తెలియని space object భూమి వైపు గంటకు లక్షల కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తోంది. దీనికి 3 I అట్లాస్ అనే పేరు పెట్టారు. మొదట్లో ఇది సాధారణ గ్రహశకలం అనుకున్నారు. కానీ హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన ప్రముఖ శాస్త్రవేత్త AV లోయెబ్ దీన్ని గ్రహాంతరవాసుల నౌక కావచ్చని సంచలన వ్యాఖ్యలు చేశారు.
చిలీ టెలిస్కోప్‌లో దీన్ని గుర్తించారు. Object సెకనుకు 60 కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తోంది. నవంబర్ చివర్లో ఇది సూర్యుడికి దగ్గరగా వెళ్తుందని అంచనా. 2017లో కూడా ఇలాంటిదే వచ్చిందని సంచలనమయ్యంది. ఇప్పుడు వచ్చే ఈ object కూడా గ్రహాంతర వాసులదే కావచ్చన్న అనుమానం ఎక్కువ అవుతోంది.
ప్రస్తుతం ఇది భూమిని ఢీకొట్టే అవకాశాలపై పరిశోధకుల మధ్య చర్చలు జోరుగా జరుగుతున్నాయి. దాడి జరిగే అవకాశం చాలా తక్కువే అయినా, ఒకవేళ నిజంగానే గ్రహాంతర నౌక అయితే ప్రపంచ దేశాలు ఉమ్మడిగా దీనిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాల్సిందే అని experts హెచ్చరిస్తున్నారు.
అసలు ఇది నిజంగా ప్రమాదమా? లేక కేవలం సిద్ధాంతమా? అన్నది రాబోయే రోజుల్లో తేలనుంది.

