ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వినాయకచవితి వేడుకల మధ్య దారుణమైన సంఘటన చోటుచేసుకుంది. గాంధీ సెంటర్‌లో వినాయక మండపం పక్కనే ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం వద్ద వర్థంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్‌రావు, ఎమ్మెల్సీ అరుణ్‌కుమార్ నివాళులు అర్పించారు.
ఇంతవరకు అన్నీ సజావుగానే జరిగాయి. కానీ వర్థంతి సభలో భాగంగా అన్నదానం విందులో చికెన్ బిర్యానీ వడ్డించటమే వివాదానికి దారితీసింది. వినాయక మండపం పక్కనే మాంసాహారం వడ్డించడం సరికాదని పలువురు అభ్యంతరం చెప్పినా, పోలీసుల మాటల్ని కూడా పెద్దగా పట్టించుకోకపోవడంతో సీఐ స్వయంగా జోక్యం చేసుకుని వాటర్ క్యాన్లు, వంట సామాగ్రి స్టేషన్‌కు తరలించారు.
ఈ సంఘటన స్థానికంగా హాట్ టాపిక్‌గా మారింది. దీంతో భక్తులు, స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తూ తీవ్రంగా స్పందించారు.
చివరికి గణేశ్ మండపం పక్కనే బిర్యానీ ఎందుకు? ఇంకా ఎక్కడైనా పెట్టవచ్చు. పంతాలకు పోయి భక్తుల మనోభావాలను దెబ్బతీయడం పెద్ద చర్చగా మారింది.

