వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ ఆరంభంలోనే ఆధిపత్యం చూపింది. యువ ఓపెనర్ యశస్వీ జైస్వాల్ 173 రన్స్ తో దూసుకెళ్తూ జట్టుకు బలాన్ని ఇచ్చాడు. అతడికి జతగా సాయి సుదర్శన్ 87 రన్స్ తో ఫామ్‌లోకి వచ్చాడు. తొలి రోజు 90 ఓవర్లలో భారత్ 318/2 తో బలంగా ఉంది. క్రీజులో జైస్వాల్‌కి.. గిల్ 20 రన్స్ తో జతగా ఉన్నాడు.
ప్రధానమైన విండీస్ బౌలర్ జోమెల్ వారికన్ రెండు వికెట్లు తీసాడు. మ్యాచ్‌లో ఆసక్తికరంగా, తొలి గంటలో 72 బంతుల్లో 60 డాట్ బాల్స్‌తో ఆట నిదానంగా ప్రారంభమై, తర్వాత భారత బ్యాట్స్‌మెన్‌లు వేగంగా పరుగులు చేస్తూ స్కోర్ పెంచారు..
రెండో సెషన్‌లో యశస్వీ-సాయి జోడీ 162 పరుగుల శతక భాగస్వామ్యం రాబట్టారు. సాయి చివరకు కెరీర్‌లో తొలి సెంచరీ సాధించలేక, 13 రన్స్ దూరంలో పెవిలియన్‌కు చేరాడు. జైస్వాల్ ఐదోసారి టెస్టులో 150 రన్స్ పూర్తి చేశాడు.
తొలిరోజు ఆటలో భారత్ స్పష్టమైన ఆధిపత్యంతో ముగిసింది.

