ఓల్డ్ మొబైల్స్‌ అమ్మేస్తున్నారా? బికేర్ ఫుల్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పెద్దనల్లబెల్లి గ్రామంలో పోలీసులు పాత మొబైల్స్ చోరీని ఆపారు. నలుగురు వ్యక్తులు నాలుగు బైక్‌లపై పాత ఫోన్లను సేకరించడానికి ఊరూరా తిరుగుతూ, ఇంట్లోని పాడైన ఫోన్లకు ప్లాస్టిక్‌ సామాన్లు ఇస్తామని మోసానికి పాల్పడుతున్నారని పోలీసులు తెలిపారు.
పోలీసుల కనుగొన్న వ్యక్తిలో బీహార్‌ రాష్ట్రం నుంచి అక్తర్‌ ఆలీఖాన్‌ అనే వ్యక్తి దొరికాడు. అతను సేకరించిన 150 పాత మొబైల్స్, ప్లాస్టిక్ సామాన్లు, ఒక బైక్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
అధికారుల ఇన్వెస్టిగేషన్ ప్రకారం, ఈ పాత మొబైల్స్ సైబర్ నేరగాళ్లకు చేరి, వాటి IEMI నంబర్లు, మదర్‌ బోర్డులు, సాఫ్ట్‌వేర్ సేకరించి, ఆ తర్వాత సైబర్ నేరాలకు పాల్డుతున్నారని తెలిపారు..
పట్టణాల్లో మరియు ఊరులో ఎవరు పాత ఫోన్లను డబ్బు లేదా సామాన్ల కోసం తీసుకుపోతే, దాన్ని వెంటనే పోలీసులకు తెలియజేయాలని అధికారులు సూచిస్తున్నారు.
ముఖ్యమైన హెచ్చరిక. ఉపయోగించని పాత మొబైల్స్, అనుమానాస్పద వ్యక్తుల చేతికి ఇవ్వకూడదు. మీకు తెలియకుండానే దాంట్లో మీ డేటా ఉండొచ్చు. అది సైబర్ నేరగాళ్ళకి రూట్ మ్యాప్ కావొచ్చు. బీకేర్ ఫుల్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *