కొత్త నటీనటులు, డిఫరెంట్ కథతో తెరకెక్కిన ‘నిలవే’ మూవీ ఆడియెన్స్ లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. సౌమిత్ రావు, శ్రేయాసి సేన్ జంటగా నటించిన ఈ చిత్రం ట్రైలర్ విడుదలైనప్పటి నుంచే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. అసిస్టెంట్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్న అనాథ అర్జున్ తీవ్ర ఒంటరితనం, డిప్రెషన్‌తో జీవితం మీద ఆశలు కోల్పోతాడు. అతని జీవితంలోకి అతిథి ప్రవేశించడంతో కథ మలుపుతిరుగుతుంది. ప్రేమ, ఎమోషన్స్, గత గాయాల నేపథ్యంలో వీరి ప్రయాణం ఆసక్తికరంగా సాగుతుంది. దర్శకులు సౌమిత్ రావు, సాయి వెన్నం సున్నితమైన ప్రేమకథను మంచి మ్యూజిక్ తో మేళవించి చూపించారు. కళ్యాణ్ నాయక్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ దిలీప్ కుమార్ అందించిన విజువల్స్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వైవా హర్ష తన కామెడీతో మెప్పించాడు. కొన్ని చోట్ల సాగదీత ఉన్నప్పటికీ, ఎమోషనల్ క్లైమాక్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ‘నిలవే’ ఒంటరితనంతో బాధపడే మనసులకు ఒక ఎమోషనల్ సందేశం అందించే రొమాంటిక్ డ్రామాగా నిలుస్తోంది.

