అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ వేసిన వ్యూహం ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. ఇటీవల ప్రధాని షెహబాజ్ షరీఫ్‌తో కలిసి ఆయన వైట్ హౌస్ సందర్శించారు. ఈ సందర్భంగా ట్రంప్‌కు విలువైన రేర్ ఎర్త్ మినరల్స్‌తో నిండిన చెక్క పెట్టెను బహుమతిగా ఇచ్చారు. శ్వేతసౌధం విడుదల చేసిన ఫొటోలలో మునీర్ ఆ రంగురాళ్ల వివరాలు చెబుతుండగా, ట్రంప్ ఆసక్తిగా పరిశీలించినట్లు కనిపించారు.
రేర్ ఎర్త్ మినరల్స్‌పై అమెరికాకు ఉన్న ఆసక్తి తెలిసిందే. చైనాకు ఉన్న ఆధిపత్యాన్ని తగ్గించాలని ట్రంప్ ఎప్పటి నుంచో చెబుతున్నారు. ఈ క్రమంలో పాక్ వ్యూహాత్మకంగా అమెరికాకు దగ్గరయ్యే ప్రయత్నంగా దీన్ని భావిస్తున్నారు. ఇప్పటికే యూఎస్ స్ట్రాటజిక్ మెటల్స్ కంపెనీ, పాక్ సైన్యానికి చెందిన ఫ్రంటియర్ వర్క్స్ ఆర్గనైజేషన్‌తో 500 మిలియన్ డాలర్ల పెట్టుబడిపై ఒప్పందం కుదిరింది. దీని ద్వారా పాకిస్థాన్‌లో కొత్త రిఫైనరీ ఏర్పాటు చేయనున్నారు.
పాకిస్థాన్ వద్ద ఉన్న రేర్ ఎర్త్ ఖజానా దేశ ఆర్థిక పరిస్థితిని మార్చేస్తుంది. రుణభారం తగ్గి, దేశం సుసంపన్నంగా మారుతుందని ఆసిమ్ మునీర్ అన్నారు.

