ట్రంప్‌కి నోబెల్‌ నిరాశ, నెటిజన్ల మీమ్స్‌

2025 నోబెల్‌ శాంతి బహుమతి ఈసారి వెనిజులా ప్రతిపక్ష నేత మారియా కొరినా మాచాడోకి లభించింది. ప్రజాస్వామ్య హక్కుల కోసం ఆమె చేసిన కృషికి ఈ గౌరవం దక్కింది. వెనిజులా ఐరన్ లేడీగా పేరుపొందిన మాచాడో, టైమ్‌ మాగజైన్‌ The 100 Most Influential People of 2025 జాబితాలో కూడా చోటు సంపాదించారు.
ఇక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ మాత్రం ఈసారి కూడా నోబెల్‌ బహుమతి గెలుచుకోలేక నిరాశ చెందారు. తాను అనేక యుద్ధాలు ఆపానని, అంతర్జాతీయ ఘర్షణల్లో మధ్యవర్తిత్వం చేశానని ట్రంప్‌ సొంత డబ్బా చెప్పుకొచ్చారు. కానీ నిపుణులు ఆయన వాదనలను సీరియస్‌గా తీసుకోలేదు.
నోబెల్‌ ఫలితాలు వెలువడగానే, ట్రంప్‌ నిరాశతో ఉన్న ఫోటోలు, వీడియోలను నెటిజన్లు సోషల్‌మీడియాలో ఫన్నీగా షేర్‌ చేస్తున్నారు.
ఇంకా నేను ఎన్ని యుద్ధాలు ఆపాలి?
నోబెల్‌ కాదు, నో-బెల్‌..
అంటూ ట్రోల్స్‌, మీమ్స్‌ వెల్లువెత్తాయి.
ట్రంప్‌ నిరాశ కంటే నెటిజన్ల హాస్యం ఎక్కువగా వైరల్‌ అవుతోంది. దీంతో 2025 నోబెల్‌ ప్రకటన సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌ టాపిక్‌గా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *