గ్యాస్ వినియోగదారులకు శుభవార్త. ఆయిల్ కంపెనీలు వాణిజ్య అవసరాల కోసం ఉపయోగించే 19 కిలోల LPG సిలిండర్ల ధరలను 51.50 రూపాయల మేరకు తగ్గించాయని ప్రకటించాయి. దీని ప్రకారం, ఢిల్లీలో 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధర రూ. 1,631.50 నుంచి రూ. 1,580కి పడిపోయింది. కోల్కతా, ముంబై, చెన్నైలో ధరలు వరుసగా 1,684, 1,531, 1,738కి తగ్గాయి. అయితే గృహ వినియోగానికి 14.2 కిలోల డొమెస్టిక్ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. ఢిల్లీలో డొమెస్టిక్ సిలిండర్ ధర రూ. 853గా కొనసాగుతోంది. ఇతర నగరాల్లో చెన్నైలో 868.50, కోల్కతా 879, ముంబైలో 852.50గా ఉన్నాయి. ప్రతీ నెల 1వ తేదీన ఆయిల్ కంపెనీలు వంట, వాణిజ్య గ్యాస్ ధరలను సమీక్షించి నిర్ణయాలు ప్రకటిస్తాయి. కేంద్ర మంత్రివర్గం ఇటీవల కంపెనీలకు దాదాపు 30,000 కోట్లు 12 విడతలుగా చెల్లించేందుకు నిర్ణయించింది, ఇది LPG ధరల స్థిరత్వానికి దోహదం చేస్తుందని తెలిసింది.

