కాన్సర్ పై రష్యా విజయం,

రష్యా శాస్త్రవేత్తల పెద్ద విజయం – క్యాన్సర్ వ్యాక్సిన్ ఆశ కిరణం
క్యాన్సర్ అనే పేరు వింటేనే భయం కలిగే రోజులు త్వరలో ముగిసే అవకాశం కనిపిస్తోంది. రష్యా ఫెడరల్ మెడికల్ అండ్ బయోలాజికల్ ఏజెన్సీ శాస్త్రవేత్తలు కొత్త క్యాన్సర్ వ్యాక్సిన్ అభివృద్ధి చేశారు.
ప్రీక్లినికల్ ట్రయల్స్‌లో ఈ వ్యాక్సిన్ కణితుల పెరుగుదలను తగ్గించడం, రోగుల జీవన రేటును పెంచడం వంటి అద్భుత ఫలితాలు చూపింది.
ప్రస్తుతం ఈ టీకా పెద్దప్రేగు క్యాన్సర్ పై పరీక్షించబడుతోంది. త్వరలోనే మెదడు క్యాన్సర్ కంటి క్యాన్సర్ వంటి ఇతర ప్రాణాంతక క్యాన్సర్లపై కూడా ప్రయోగాలు జరుగుతున్నాయి.
ఈ వ్యాక్సిన్ విజయవంతమైతే, చికిత్స ఖర్చులు తగ్గి, లక్షలాది రోగుల జీవితాల్లో కొత్త ఆశ వెలుగులు ప్రసరిస్తాయి.
శాస్త్రవేత్తల కృషి మరోసారి నిరూపించింది – మానవ మేధస్సు ముందు ఎలాంటి శత్రువైనా ఓడిపోవాల్సిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *