తెలంగాణలో కల్వకుంట్ల కవిత.. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ షర్మిల ఇద్దరూ తమ కుటుంబాలతో విభేదాలు పెట్టుకుని రాజకీయంగా కొత్త దారులు వెతుకుతున్నారు. ఈ ఇద్దరి పరిస్థితులు ఒకేలా కనిపిస్తున్నా లోతుగా చూస్తే పూర్తిగా ఆపోజిట్ గా కనిపిస్తుంది.
షర్మిల తన అన్న జగన్‌తో విభేదించి తెలంగాణలో వైఎస్సార్‌టీపీని స్థాపించారు. కానీ పెద్దగా ఒరిగింది లేక ఆ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసి, ఇప్పుడు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఉన్నారు. కవిత బీఆర్‌ఎస్‌లో తన తండ్రి కేసీఆర్, అన్న కేటీఆర్‌తో విభేదాలు పెరగడంతో పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు. ఆమె భవిష్యత్తు రాజకీయ దారిని ఇంకా ఖరారు చేయలేదు – కొత్త పార్టీ పెట్టాలా, లేక మరో పార్టీలో చేరాలా అన్నది సస్పెన్స్ గా ఉంది.
షర్మిల కూల్ గా వ్యాఖ్యలు చేసే లీడర్ కాగా, కవిత మాత్రం నేరుగా పేర్లు బయటపెడుతూ ఆధిపత్య ఆరోపణలు చేస్తున్నారు. షర్మిల వారసత్వం తెలంగాణలో పెద్దగా వర్కవుట్ కాలేదు, కవితకు తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్రతో బలమైన గుర్తింపు ఉంది.
ఈ పోలికలపై మీడియాలో కవిత స్పందిస్తూ కాలమే సమాధానం చెబుతుందంటూ తేలికగా తీసుకున్నారు.

