అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల విషయంలో వైసీపీ అధినేత వైయస్ జగన్ నిర్ణయాలు మారుతూ ఉండటం రాజకీయంగా హాట్ టాపిక్ అయింది. మొదట సభకు వస్తానన్న జగన్, తర్వాత ప్రతిరోజూ హాజరవుతానని పార్టీ వర్గాలు చెప్పినా… తొలి రోజు కొద్ది నిముషాలపాటు ఉండి వెళ్లిపోయారు. ఆపై పూర్తిగా గైర్హాజరు అయ్యారు.
ఇక ఎమ్మెల్సీలకు మాత్రం పూర్తి స్థాయిలో మండలిని వినియోగించుకోవాలని సూచించారు. నాకన్నా మీకే ఎక్కువ తెలుసంటూ వారిని ప్రోత్సహిస్తూ, అన్ని అంశాలపై ఆధారాలతో సిద్ధంగా ఉండాలని చెప్పారు. అసెంబ్లీలో తనకు తక్కువ సమయం ఇస్తారని చెప్పిన జగన్, మండలిలోనే గట్టిగా పోరాడాలని చెప్పారు.
వచ్చే ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత కష్టపడిన వారికే గుర్తింపు ఉంటుందని స్పష్టం చేస్తూ, ఎమ్మెల్సీలను యాక్టివ్ చేయాలనే ప్రయత్నం ప్రారంభించారు.

