యాంకర్‌గా, నటిగా రెండు రంగాల్లో కూడా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అనసూయ భరధ్వాజ్ మళ్లీ వార్తల్లోకి ఎక్కింది. తాజాగా ఆమె గత ఇంటర్వ్యూలో చేసిన కామెంట్లు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఆ ఇంటర్వ్యూలో అనసూయ తన లవ్ లైఫ్ గురించి మాట్లాడుతూ, నా జీవితంలో ఒకే ఒక్క బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడు, ఆయనే నా భర్త అని చెప్పింది. అలాగే, ఒకవేళ మీరు డేటింగ్ చేయాల్సివస్తే ఏ హీరోతో చేస్తారు? అని అడగ్గా, ఏమాత్రం ఆలోచించకుండా రామ్ చరణ్ పేరు చెప్పేసింది.
చరణ్ నటించిన రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్ర చేస్తున్నప్పడు చరణ్ అంటే చాలా ఇష్టమైందని, ఆయనతో డేటింగ్ చేస్తానని చెప్పిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ప్రస్తుతం అనసూయ పలు సినిమాలు, టీవీ షోలతో బిజీగా ఉండి, సోషల్ మీడియాలోనూ తన స్టైలిష్ లుక్స్‌తో ఫ్యాన్స్‌ని ఆకట్టుకుంటోంది.

