టీ20 వరల్డ్ కప్: సౌతాఫ్రికా చేతిలో భారత్‌ ఓటమి

ఐసీసీ టీ20 World Cup 2026 సూపర్-8 దశలో టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన కీలక మ్యాచ్‌లో సౌతాఫ్రికా 76 పరుగుల తేడాతో భారత్‌ను చిత్తు చేసింది. ముందుగా బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 20 ఓవర్లలో 7 వికెట్లకు 187 పరుగులు చేసింది. డేవిడ్ మిల్లర్ 63 పరుగులతో చెలరేగగా, బ్రెవిస్ 45, స్టబ్స్ 44 విలువైన ఇన్నింగ్స్ ఆడారు. భారత్ తరఫున బుమ్రా 3 వికెట్లు తీశాడు.
187 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 18.5 ఓవర్లలో 111 పరుగులకే ఆలౌట్ అయింది. శివమ్ దూబే 42 రన్స్ తో ఒక్కడే పోరాడగా మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. మార్కో యాన్సెన్ 4 వికెట్లతో భారత బ్యాటింగ్‌ను కుదేలు చేశాడు. ఈ ఓటమితో భారత్ వరుసగా 17 మ్యాచ్‌ల విజయ పరంపర ముగిసింది. సెమీఫైనల్ అవకాశాలు కష్టమైపోయాయి. ఇక మిగిలిన మ్యాచ్‌లను మెరుగైన రన్‌రేట్‌తో గెలవాల్సిన ఒత్తిడి టీమిండియాపై పెరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *