గాజాలో యుద్ధం మళ్లీ తీవ్రం అవుతున్న సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హమాస్ బందీలను విడుదల చేయకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.
ట్రంప్ ప్రతిపాదన ప్రకారం —
హమాస్ వెంటనే మిగిలిన 48 మంది బందీలను విడుదల చేయాలి.
దానికి ప్రతిగా ఇజ్రాయెల్ వేలాది మంది పాలస్తీనా ఖైదీలను విడిచిపెడుతుంది.
కాల్పుల విరమణ సమయంలో శాంతి చర్చలు జరుగుతాయి.
ఇజ్రాయెల్ నా షరతులను అంగీకరించింది. ఇప్పుడు హమాస్ నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చింది” అని ట్రంప్ తన సోషల్ మీడియా ట్రూత్ సోషల్ లో స్పష్టం చేశారు.
ఇజ్రాయెల్ అధికారులు ఈ ప్రతిపాదనను గౌరవంగా పరిశీలిస్తున్నామని చెప్పారు. విదేశాంగ మంత్రి గిడియాన్ సార్ మాత్రం హమాస్ బందీలను విడుదల చేసి ఆయుధాలు కింద పెడితే యుద్ధం ముగుస్తుందని మళ్లీ స్పష్టం చేశారు.

