వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ నాయకుడు, మాజీ మంత్రి పేర్ని నాని ఇటీవల ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సంచలన కామెంట్స్ చేశారు. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే కొడాలి నాని, వల్లభనేని వంశీ వైసీపీని విడిచిపెడతారా అన్న ప్రశ్నకు తానెప్పుడూ ఎన్టీఆర్ వారసుడిని గౌరవిస్తానని, కానీ ఆయన రాజకీయాల్లోకి వచ్చినా జగన్ మోహన్ రెడ్డిపై గాని వైసీపీపై గాని ఎలాంటి ప్రభావం ఉండదని స్పష్టం చేశారు. జూనియర్ ఎన్టీఆర్ కారణంగా టీడీపీ మాత్రమే నష్టపోయే అవకాశం ఉందని, వైసీపీకి ఏమాత్రం నష్టం జరగదని చెప్పారు.
కొడాలి నానితో తనకు 25 ఏళ్ల స్నేహం ఉందని, అభిప్రాయ భేదాలు ఉన్నప్పటికీ స్నేహం కొనసాగుతుందని చెప్పారు. ముఖ్యంగా, జూనియర్ ఎన్టీఆర్ వచ్చినా, కొడాలి నాని జగన్ మోహన్ రెడ్డిని విడిచిపెట్టరని, అవసరమైతే దానికి తాను బాధ్యత తీసుకుంటానని నాని పేర్కొన్నారు.
వైఎస్ఆర్. కాంగ్రెస్ నాయకులు పార్టీపై నమ్మకంతో ఉంటారని, వ్యక్తిగత స్నేహాలను రాజకీయాలకు ముడిపెట్టరని అన్నారు.

