ఆంధ్రప్రదేశ్ యువ నేత నారా లోకేశ్ తన డైనమిక్ లీడర్ షిప్, ధైర్యం వల్ల పార్టీలో కీలక స్థానాన్ని సంపాదించుకున్నారు. కింది స్థాయి కేడర్ కూడా లేని మంగళగిరిలో పోటీ చేసి భారీ విజయం సాధించడం ఆయన పట్టుదల, ధైర్యాన్ని చూపింది. ప్రస్తుతం ఐటీ, కమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్, HRD శాఖల మంత్రి లోకేశ్, రాష్ట్రంలో విద్యా, స్కిల్ డెవలప్మెంట్, మౌలిక సదుపాయాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చే, ఆర్థిక, మానవ వనరుల అభివృద్ధికి కీలక పాత్ర పోషిస్తున్న ఆయనకు ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రత్యేకంగా ఆహ్వానం పలికింది. ఈ పర్యటనలో లోకేశ్ విద్యా, స్కిల్ డెవలప్మెంట్, అక్వా కల్చర్, మౌలిక సదుపాయాల అంశంపై పెట్టుబడిదారులతో మాట్లాడనున్నారు. 2001 సంవత్సరంలో గుజరాత్ సీఎం గా ఉన్నప్పుడు నరేంద్ర మోడీ పాల్గొన్న కార్యక్రమంలో లోకేష్ కి ఆహ్వానం రావడం ఆంధ్రప్రదేశ్ ప్రపంచ స్థాయిలో పరిచయం కావడం చాలా విశేషమని విశ్లేషకులు భావిస్తున్నారు.

