దేశవ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ముంబైలోని కింగ్స్ సర్కిల్ GSB సేవా మండలి ఆద్వర్యంలో గణపతి మండపం దేశంలోనే అత్యంత ధనికమైనదిగా పేరు తెచ్చుకుంది. ఈసారి ఆ మండపానికి 474.46 కోట్ల విలువైన ఇన్సూరెన్స్ తీసుకోవడం విశేషం. గత ఏడాది 400 కోట్లతో రికార్డు సృష్టించగా, ఈసారి దానిని మించి ఇన్సూరెన్స్ కవరేజ్ పొందింది. ఇందులో బంగారం, వెండి ఆభరణాలకు 67 కోట్ల ఆల్ రిస్క్ పాలసీ.. ఉండగా, వాలంటీర్స్, పూజారులు, సెక్యూరిటీ, పార్కింగ్ ఎంప్లాయీస్, భక్తులు కూడా ఈ ఇన్సూరెన్స్ పరిధిలోకి వచ్చారు. అగ్నిప్రమాదం, భూకంపం వంటి ప్రమాదాలకూ స్పెషల్ ఇన్సూరెన్స్ ఉంది. ఐదు రోజులపాటు జరిగే ఈ ఉత్సవాల్లో వినాయకుడిని 69 కిలోల బంగారం, 336 కిలోల వెండితో అలంకరించారు.
ఈ బీమా మొత్తం దేశంలోనే అతి పెద్దదిగా భావిస్తున్నారు.
భక్తుల భద్రత కోసం ప్రత్యేక సెక్యూరిటీ ఏర్పాట్లు చేశారు.
ఉత్సవాల్లో లక్షలాది మంది భక్తులు గణనీయంగా పాల్గొననున్నారు.
ఈ ఉత్సవాలు ఆగస్టు 31 వరకు వైభవంగా జరగనున్నాయి.

