మనోళ్ళనుకుంటే ఇలా చేశారేంటి: వైసిపి.

ఉమ్మడి కడప జిల్లాలో పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో వైసీపీకి ఘోర ఓటమి ఎదురైంది. తమ బలమైన కోటల్లాంటి ప్రాంతాల్లోనే ఫలితాలు ప్రతికూలంగా రావడంతో ఆ పార్టీ తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఎన్నికల కమిషన్ నుంచి సహకారం రాకపోవడమే ఓటమికి ప్రధాన కారణమని వైసీపీ వర్గాలు అంటున్నాయి. నీలం సాహ్ని ఎన్నికల కమిషనర్‌గా ఉండటం వల్ల తాము చెప్పినట్లు జరిగిపోతుందని వైసీపీ ఆశించినా, ఆ విధంగా జరగలేదని నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పక్క ప్రాంతాల నుంచి వచ్చి స్థానికుల పేర్లతో ఓట్లు వేశారని ఆరోపిస్తూ, పోలింగ్ వీడియోలు, వెబ్‌కాస్టింగ్ రికార్డులు ఇవ్వాలని వైసీపీ ఎన్నికల కమిషన్‌ను కోరింది. అయితే టీడీపీ మాత్రం ఇవన్నీ ఫేక్ వీడియోలేనని ఎదురుదాడి చేస్తోంది. హైకోర్టు కూడా రీపోలింగ్‌పై జోక్యం చేసుకోకపోవడంతో ఫలితాలు ఖరారయ్యాయి. జగన్ స్వస్థలంలోనే ఎదురైన ఈ పరాజయం వైసీపీకి పెద్ద షాక్‌గా మారగా, పార్టీ భవిష్యత్ వ్యూహం ఏంటి అన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారి తీస్తోంది.

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *