శాసన మండలిలో ఐదుగురు ఎమ్మెల్సీలపై విచారణ

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. పార్టీకి, పదవులకు రాజీనామా చేసిన ఐదుగురు ఎమ్మెల్సీలకు శాసన మండలి చైర్మన్ మోషెన్ రాజు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 25న జయమంగళం వెంకటరమణ, 26న కళ్యాణ్ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ, పోతుల సునీత, మర్రి రాజశేఖర్ విచారణకు హాజరు కావాలని ఆదేశించారు.
వైసీపీ ఓటమి తర్వాత 2024లో వీరు రాజీనామాలు చేసినప్పటికీ అవి ఇప్పటికీ పెండింగ్‌లోనే ఉన్నాయి. జయమంగళం వెంకటరమణ కోర్టును కూడా ఆశ్రయించడంతో ఈ విచారణకు ప్రాధాన్యం ఏర్పడింది.
విచారణ అనంతరం రాజీనామాలు ఆమోదిస్తే ఐదు సీట్లు ఖాళీ కావచ్చు. ఆ పరిస్థితిలో జరిగే ఎన్నికల్లో కూటమికే లాభం చేకూరుతుందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. 25, 26 తేదీల్లో జరిగే పరిణామాలు శాసన మండలి రాజకీయాల్లో ఆసక్తి రేపుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *