ఏపీ ఐటి మరియు విద్యాశాఖా మంత్రి నారా లోకేష్ బనకచర్ల విషయంలో చేసిన వ్యాఖ్యలకు తెలంగాణ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. బనకచర్ల ప్రాజెక్ట్ విషయం రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అవుతోంది. ఎవరికివారు తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. తాజాగా నారా లోకేష్ చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. లోకేష్ చేసిన కామెంట్స్ పై బీఆర్ఎస్ నాయకులు సీరియస్ అయ్యారు. ప్రస్తుత తెలంగాణ మంత్రులు సైతం లోకేష్ చేసిన కామెంట్స్ పైన మండిపడుతున్నారు. తెలంగాణా

మంత్రి శ్రీధర్ బాబు స్పందిస్తూ బనకచర్లను వ్యతిరేకిస్తున్నామని, కృష్ణా, గోదావరి జలాల వాటాలు తేలిన తర్వాత కొత్త ప్రాజెక్టుల గురించి మాట్లాడాలని చెప్పారు. మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా మాట్లాడుతూ లోకేష్ గోదావరి గురించి పూర్తిగా తెలుసుకోవాలని, ఎద్దేవా చేశారు. చుక్క నీరు కూడా వదిలేది లేదని, ప్రజలను మభ్యపెడితే సహించేదిలేదని స్పష్టం చేశారు.

