ముంబై నుంచి విశాఖకు సముద్ర గర్భ కేబుల్

ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, వాట్సాప్‌ మాతృసంస్థ మెటా, భారత్‌లో తమ సముద్రగర్భ కేబుల్‌ ప్రాజెక్ట్‌ కోసం సైఫీ టెక్నాలజీస్ ను ల్యాండింగ్ భాగస్వామిగా ఎంపిక చేసింది. ఈ ఒప్పందం విలువ సుమారు 5 మిలియన్ డాలర్లు. ఈ కేబుల్‌ను ముంబయి, విశాఖపట్నం తీరాల్లో డాకింగ్ చేయనున్నారు.
ఇది ప్రపంచంలోనే అతిపెద్ద సముద్రగర్భ కమ్యూనికేషన్ ప్రాజెక్ట్‌. ఈ ప్రాజెక్ట్ వాటర్‌వ‌ర్త్ 50,000 కిలోమీటర్ల పొడవుతో, భూమి చుట్టుకొలత కంటే ఎక్కువగా ఉండే ఈ కేబుల్‌ ఐదు ఖండాలను కలుపుతుంది. దీన్ని సముద్రంలో సుమారు 7,000 మీటర్ల లోతులో బలంగా వేయనున్నారు.
ఈ ప్రాజెక్ట్ పూర్తయ్యాక దేశీయ టెలికాం కంపెనీలు ఈ కేబుల్‌కు అనుసంధానమై వేగవంతమైన ఇంటర్నెట్‌ సేవలను అందించనున్నాయి.
ఇప్పటికే రిలయన్స్‌ జియో, భారతి ఎయిర్‌టెల్, టాటా కమ్యూనికేషన్స్ వంటి సంస్థలు కూడా తమ సబ్‌సీ కేబుల్‌ ప్రాజెక్ట్‌లలో దూసుకెళ్తున్నాయి. నిపుణుల అంచనాల ప్రకారం, వచ్చే 5-10 ఏళ్లలో మెటా భారత్‌లో 10 బిలియన్‌ డాలర్ల వరకు పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది.
ట్రాయ్‌ నివేదిక ప్రకారం, ప్రపంచ సముద్రగర్భ కేబుల్‌ మార్కెట్‌ 2028 నాటికి 40.58 బిలియన్ డాలర్లకు చేరే అవకాశం ఉంది. దీంతో భారత్‌ గ్లోబల్‌ డిజిటల్‌ హబ్‌గా మరింత బలపడనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *