ప్రేమించాలని ఉంది: ప్రభాస్

టాలీవుడ్ రెబల్ స్టార్ Prabhas మరోసారి తన పెళ్లి విషయంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పాన్ ఇండియా స్టార్‌గా వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఆయన, వ్యక్తిగత జీవితం గురించి అరుదుగా మాట్లాడుతుంటారు. అయితే తాజాగా Couple Friendly సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా జరిగిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ప్రేమపై తన మనసులోని భావాలను పంచుకున్నారు.
హీరోయిన్ మానస వారణాసి అడిగిన మీకు లవ్ అంటే ఏంటి? అన్న ప్రశ్నకు మొదట సరదాగా స్పందించిన ప్రభాస్, తరువాత మీ సినిమా చూసాక నాకూ ప్రేమలో పడాలని అనిపించింది అని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు. అలాగే క్లాసిక్ చిత్రం గీతాంజలి చూసినప్పుడు కూడా ఇలాంటి ఫీలింగ్ వచ్చేదని గుర్తుచేశారు.
ప్రభాస్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పెళ్లి గురించి ఎప్పుడూ మౌనం పాటించే ఆయన, ప్రేమలో పడాలని ఉందని నేరుగా చెప్పడం అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఇక డార్లింగ్ మనసు దోచుకునే అదృష్టవంతురాలు ఎవరో డిస్కషన్స్ మొదలైపోయాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *