నారా భువనేశ్వరి వీడియో మెసేజ్ వైరల్

Heritage Foods సంస్థ ప్రస్థానం, నాణ్యతా ప్రమాణాలపై వైస్ చైర్‌పర్సన్ మరియు ఎండీ నారా భువనేశ్వరి విడుదల చేసిన వీడియో మెసేజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తిరుమల లడ్డూ నెయ్యి నాణ్యతపై రాజకీయ చర్చలు నడుస్తున్న నేపథ్యంలో, హెరిటేజ్ ఉత్పత్తుల విశ్వసనీయతపై ఆమె స్పష్టతనిచ్చారు.
33 ఏళ్ల ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ, 4 కోట్ల పెట్టుబడితో ప్రారంభమైన సంస్థ నేడు 4 వేల కోట్ల టర్నోవర్‌ సాధించిందని తెలిపారు. ఎంత ఎదిగినా నాణ్యత విషయంలో రాజీపడలేదని స్పష్టం చేశారు. చూసిందే నమ్మండి అంటూ హెరిటేజ్ ప్రామిస్ వీడియో ద్వారా వినియోగదారులకు భరోసా కల్పించారు.
ప్రతి ఉత్పత్తి మార్కెట్‌లోకి వచ్చే ముందు 25 రకాల నాణ్యతా పరీక్షలు నిర్వహిస్తున్నామని, ఈ ప్రక్రియను పర్యవేక్షించేందుకు 500 మందికి పైగా experts పనిచేస్తున్నారని వెల్లడించారు. అలాగే 9 రాష్ట్రాల్లో సుమారు 3 లక్షల మంది పాడి రైతులు heritage తో అనుసంధానమై ఉన్నారని, వారికి సరైన ధరలు, పారదర్శక కొలతలు, సమయానికి చెల్లింపులే తమ విజయరహస్యమని భువనేశ్వరి తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *