ట్రంప్ ఖేల్ ఖతం – టారిఫ్‌లు రద్దు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన పలు దేశాలపై టారిఫ్‌లను అమెరికా సుప్రీంకోర్టు 6-3 మెజారిటీతో కొట్టివేసింది. కాంగ్రెస్ అనుమతి లేకుండా అత్యవసర అధికారాలను వినియోగించి టారిఫ్స్ విధించడం రాజ్యాంగ విరుద్ధమని కోర్టు స్పష్టం చేసింది. జాతీయ భద్రత, ఆర్థిక అత్యవసర పరిస్థితులను చూపుతూ తీసుకున్న ఈ నిర్ణయాలు చట్టబద్ధ ప్రక్రియను అనుసరించలేదని న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు. వాణిజ్య విధానాల్లో తుది నిర్ణయాధికారం కాంగ్రెస్‌కే చెందుతుందని గుర్తుచేసిన కోర్టు, అధ్యక్ష అధికారాలకు పరిమితులు ఉన్నాయని తేల్చిచెప్పింది. ఈ తీర్పుతో ట్రంప్ అమలు చేసిన టారిఫ్‌లు రద్దయ్యే అవకాశం ఉండగా, చైనా మరియు యూరప్ దేశాలతో వాణిజ్య సంబంధాలు rebuild చేసే అవకాశముంది. రాజకీయంగా కూడా ఈ నిర్ణయం అమెరికాలో హాట్ టాపిక్ గా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *