జైలు జోష్‌లో అంబటి – మళ్లీ మంత్రినవుతా, తగ్గేదేలే

తెలుగు రాష్ట్రాల్లో జైలు సెంటిమెంట్ రాజకీయాల్లో మళ్లీ చర్చనీయాంశమైంది. తాజాగా వైసీపీ ఫైర్ బ్రాండ్ నేత అంబటి రాంబాబు రాజమండ్రి జైలులో 18 రోజుల పాటు ఉండి బయటకు వచ్చిన తర్వాత మీడియా మీట్‌లో చేసిన కామెంట్స్ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. జైలులో తన అనుభవాలను వివరించిన ఆయన, పోలీస్ స్టేషన్‌లో తనను కొట్టేందుకు ప్రయత్నించారని ఆరోపిస్తూ, తాను మళ్లీ మంత్రి అవుతానని ధీమా వ్యక్తం చేశారు. నాకు జైలు సినిమా చూపించారు కానీ నేను హీరోనే అంటూ కూటమి నేతలపై విమర్శలు గుప్పించారు.
ఇక 2029లోకి అధికారంలోకి వస్తామని వైసీపీ నేతలు చెబుతున్న నేపథ్యంలో అంబటి ముందుగానే తన కేబినెట్ బెర్త్ ఖాయం చేసుకున్నారా అన్న చర్చ మొదలైంది. సత్తెనపల్లి నుంచి ఒకసారి గెలిచిన ఆయన ప్రస్తుతం గుంటూరు పశ్చిమ నియోజకవర్గంపై దృష్టి పెట్టారు. జైలు తర్వాత తన ఇమేజ్ పెరిగిందని వైసీపీ వర్గాలు చెబుతుండగా, అంబటి వర్గీయులు 2029లో గెలుపు ఖాయమని ప్రచారం చేస్తున్నారు. మొత్తానికి జైలు సెంటిమెంట్ అంబటికి బూస్ట్ అంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *