ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది. YS జగన్, KVP రామచంద్రరావు చాలా ఏళ్ల తర్వాత చెన్నైలో జరిగిన కుటుంబ వివాహ వేడుకలో ఆత్మీయంగా కలుసుకోవడం హాట్ టాపిక్‌గా మారింది.
ఉమ్మడి ఏపీ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన కేవీపీ, దివంగత YS. రాజశేఖర్ రెడ్డి కి ఆత్మీయుడిగా, వ్యూహకర్తగా పేరొందారు. వైఎస్సార్ హయాంలో ఆయన చేసిన సూచనలు successful గా ఉండేవని చెబుతారు. బెంగళూరు కేంద్రంగా వ్యూహాలు రచిస్తున్న జగన్, పాత అనుబంధాలను తిరిగి కలుపుకుంటున్నారన్న ప్రచారం సాగుతోంది. కేవీపీతో ప్రత్యేకంగా భేటీ అయ్యి సలహాలు తీసుకున్నారన్న గాసిప్స్ వినిపిస్తున్నాయి.
ఇది కాంగ్రెస్‌తో సమీకరణల సంకేతమా? లేక 2029 జాతీయ రాజకీయాల దిశగా వైసీపీ మాస్టర్ ప్లాన్‌కా? అనే చర్చ జోరుగా సాగుతోంది.

