ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ మురికి రాజకీయాలకు పాల్పడుతోందని, దేశ ప్రతిష్టను దెబ్బతీసే చర్యలు చేస్తోందని మండిపడ్డారు. అంతర్జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ ను రాజకీయ వేదికగా మార్చడం తగదని అన్నారు. విదేశీ శక్తులతో చేతులు కలిపి భారత్ పరువును తీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు.
ఏపీ ఇంపాక్ట్ సమ్మిట్ లో కాంగ్రెస్ యువజన విభాగానికి చెందిన కొంతమంది కార్యకర్తలు అర్ధనగ్నంగా నిరసన చేపట్టడం వివాదానికి దారితీసింది. అమెరికాతో మోదీ సంబంధాలపై ప్రశ్నలు లేవనెత్తుతూ నినాదాలు చేశారు. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం కేసులు నమోదు చేసింది.
ఈ పరిణామం బీజేపీ-కాంగ్రెస్ మధ్య రాజకీయంగా సీరియస్ మరింతగా పెంచింది. ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారని, తగిన సమయంలో తగిన నిర్ణయం తీసుకుంటారని ప్రధాని పేర్కొన్నారు.

