ఏప్రిల్ 1 నుంచి పాన్ కార్డ్ కొత్త రూల్స్.. తెలుసుకోండి

ఆదాయపు పన్ను చట్టానికి సంబంధించిన పాన్ కార్డు ముసాయిదా రూల్స్ ను కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు CBDT విడుదల చేసింది. ప్రజాభిప్రాయాల స్వీకరణకు రేపే చివరి తేదీ కాగా, మార్పులతో ఏప్రిల్ 1 నుంచి ఇవి అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. తాజా ప్రతిపాదనల ప్రకారం, ఒక ఏడాదిలో బ్యాంక్ ఖాతాల్లో నగదు డిపాజిట్ లేదా విత్‌డ్రా మొత్తం 10 లక్షలు దాటితే పాన్ వివరాలు తప్పనిసరి. ప్రస్తుతం ఒక్క రోజులో 50 వేలకుపైగా నగదు జమచేసినా పాన్ ఇవ్వాలి. 5 లక్షలకుపైగా విలువైన వాహనాల కొనుగోలు సమయంలోనూ పాన్ తప్పనిసరి. రెస్టారెంట్ బిల్లు లక్ష దాటితే కస్టమర్ పాన్ వివరాలు నమోదు చేయాలి. Concerts, exhibitions, sports events విషయాల్లో పాన్ కోట్ చేయాల్సి ఉంటుంది. 20 లక్షలకుపైగా ఆస్తుల విక్రయాల్లో పాన్ వివరాలు వెల్లడించాలి. ఇన్సూరెన్స్ ప్రీమియం విషయంలో ఇకపై అన్ని సందర్భాల్లో పాన్ తప్పనిసరి. ఈ మార్పులతో నగదు లావాదేవీలపై పన్ను శాఖ పర్యవేక్షణ మరింత కట్టుదిట్టం కానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *