ఊపిరి పోతోంది, వదిలితే బెటర్

దేశ రాజధాని ఢిల్లీ మరోసారి ఎయిర్ పొల్యూషన్ తో వణికిపోతోంది. శీతాకాలం మొదలవగానే వాతావరణంలో పొగమంచు, ధూళి, వాయు కాలుష్యం మోత ముమ్మరంగా పెరిగింది. ఢిల్లీలోని అనేక ప్రాంతాల్లో గాలి నాణ్యతా సూచీ 400 దాటింది. ఇది తీవ్ర ప్రమాద స్థాయిగా నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఎయిమ్స్ మాజీ పల్మోనాలజిస్ట్ డాక్టర్ గోపీచంద్ ఖిల్నాని మాట్లాడుతూ – “
వాయు కాలుష్యం కారణంగా ఊపిరితిత్తుల, గుండె సంబంధిత వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి. వీలున్న వారు రెండు నెలల పాటు ఢిల్లీని వదిలి వేరే ప్రాంతాలకు వెళ్ళడం మంచిదని సూచించారు.
కాలుష్యం ప్రభావంతో ఆక్సిజన్ పీల్చుకోవడమే కష్టమైపోతోందని, వృద్ధులు, పిల్లలు, గుండె మరియు ఊపిరితిత్తుల వ్యాధులతో బాధపడుతున్న వారు వెంటనే ఢిల్లీ బయటికి వెళ్ళాలని ఆయన హెచ్చరించారు.
ఫిబ్రవరి వరకు ఈ పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి, ఢిల్లీ వాసులు గాలిని కాకుండా కాలుష్యాన్ని పీలుస్తున్న ఈ టైమ్‌లో జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *