ఉగాది తర్వాత జగన్ కొత్త రూట్

వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీని పటిష్టం చేయడంపై దృష్టి సారించినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ప్రస్తుతం బెంగళూరులో ఉంటూనే పార్టీ సంస్థాగత నిర్మాణంపై వ్యూహాలు రచిస్తున్నారని సమాచారం. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని గ్రౌండ్ లెవెల్‌లో పార్టీని బలంగా నిలబెట్టాలని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇంచార్జిలను నియమించిన వైసీపీ, బూత్ స్థాయి కమిటీల ఏర్పాటును వేగవంతం చేసింది. ప్రతి నియోజకవర్గంలో కనీసం 15 వేల మంది పార్టీ పదవుల్లో ఉండేలా నిర్మాణం పూర్తి చేయాలని జగన్ సూచించినట్లు చెబుతున్నారు.
తాజా ప్రచారం ప్రకారం ఉగాది తర్వాత జగన్ జిల్లాల టూర్ ప్రారంభించే అవకాశం ఉందని సమాచారం. రాష్ట్రంలోని 26 జిల్లాల్లో పర్యటిస్తూ పార్టీ నేతలు, క్యాడర్‌తో సమావేశాలు నిర్వహించి గ్రౌండ్ రియాలిటీలను తెలుసుకునే ప్రణాళిక ఉందని తెలుస్తోంది. ఉగాది తర్వాత ఈ టూర్ నిజంగా ప్రారంభమవుతుందా అన్నది చూడాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *